News April 1, 2025
SSS: జిల్లా వ్యాప్తంగా 93.31 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో మంగళవారం 93.31 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పింఛనుదారులు 2,62,702 మంది ఉన్నారన్నారు. మొదటి రోజు పింఛన్ దారులకు రూ. 2,79,6000 కోట్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి బుధవారం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారన్నారు.
Similar News
News November 2, 2025
వనపర్తి: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేయండి

2025లో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. అదే విధంగా గతంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు ఎంపికైన వారు రెన్యువల్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News November 2, 2025
మణుగూరు దాడి.. భద్రాచలం MLA ఎటువైపు?

తాను BRS పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కు తెలిపిన భద్రాచలం MLA తెల్లం వెంకటరావు ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మణుగూరులోని BRS కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. దాడిని ఖండించక పోవడం, మద్దతు ప్రకటించకపోవడంపై BRS శ్రేణులు, సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తారో లేదో చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.


