News March 30, 2026

SSY, PPF వడ్డీ రేట్లు ఇవే..

image

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదోసారీ మార్చలేదు. FY27లో APR 1 నుంచి JUNE 30 వరకు పాత రేట్లే కొనసాగుతాయి. సుకన్య సమృద్ధి యోజన(SSY) డిపాజిట్లకు 8.2%, మూడేళ్ల కాల పరిమితి సేవింగ్స్‌కు 7.1% వడ్డీ లభిస్తుంది. PPFకు 7.1%, పోస్టాఫీస్ డిపాజిట్లకు 4%, కిసాన్ వికాస్ పత్రకు 7.5%(115 నెలలు), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 7.7%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌కు 7.4% వడ్డీ ఉంటుంది.

Similar News

News April 10, 2026

గేల్ రికార్డును బ్రేక్ చేసిన బాబర్

image

T20 క్రికెట్‌(ఇంటర్నేషనల్+లీగ్)లో అత్యంత వేగంగా 12వేల రన్స్ చేసిన ప్లేయర్‌గా బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించారు. గేల్ 343 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా బాబర్ 338 ఇన్నింగ్సుల్లోనే బ్రేక్ చేశారు. PSLలో పెషావర్ జల్మీకి ఆడుతున్న ఆయన కరాచీ కింగ్స్‌పై 87 రన్స్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ(360 inns) ఉన్నారు.

News April 10, 2026

మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు!

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(NCST) విచారణలో ఆమె మైనర్ అని తేలింది. పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 ఏళ్ల 2 నెలలే అనే అంశం బయటపడింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ PSలో భర్తపై పోక్సో కేసు నమోదైంది. కాగా ఈ పెళ్లి లవ్ జిహాద్ అని కుటుంబీకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News April 10, 2026

ఈ స్టార్ ఖాతాలో 4 ₹వెయ్యి కోట్ల సినిమాలు!

image

భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. అత్యధికంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో నటించిన నటుడిగా నిలిచారు. ఆయన నటించిన KGF 2, జవాన్, ధురంధర్- 1&2 సినిమాలు ఈ మైలురాయిని దాటాయి. షారుఖ్, ప్రభాస్, రణ్‌వీర్‌ వంటి స్టార్ హీరోల కంటే ఎక్కువగా 4 సార్లు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆయన నటించడం విశేషం. సంజయ్ దత్ తర్వాత దీపికా పదుకొణె(3) ఉన్నారు.