News November 23, 2024

STల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం: కలెక్టర్

image

షెడ్యూల్డ్ తరగతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శుక్రవారం విడవలూరు మండలం పార్లపల్లి ఎస్‌టీ కాలనీ, కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం ఎస్టీ కాలనీని అధికారులతో కలసి సందర్శించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ARD) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్టీ మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.

Similar News

News December 14, 2024

నెల్లూరు: కోడిగుడ్డు ధర రూ.10? 

image

నెల్లూరు జిల్లాలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర పలు ప్రాంతాల్లో రూ.7.50కు చేరింది. వారం రోజుల క్రితం వరకు ఈ ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధరలకు రెక్కలు వచ్చినట్లు స్థానికులు వాపోయారు. మరిన్ని రోజుల్లో ఈ ధర రూ.10కు చేరొచ్చని వ్యాపారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.  

News December 14, 2024

నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు

image

నేడు నెల్లూరు జిల్లాలోని 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 3,698 టీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2.95లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు 9,120 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.

News December 13, 2024

నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు

image

రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.