News May 12, 2024
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

AP: పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఈరోజు సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం సరిగ్గా ఏడింటికి పోలింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Similar News
News December 10, 2025
బొదులూరు పీహెచ్సిని ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటీడీఏ పీవో

మారేడుమిల్లి మండలంలోని బొదులూరు పీహెచ్సిని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


