News March 16, 2025

వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం: కిషన్ రెడ్డి

image

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర CM స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోదీ సర్కారు. రూపీ సింబల్‌ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

Similar News

News December 9, 2025

చలికాలం కదా అని!

image

చలికాలంలో చాలామంది నీరు తాగడంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఈ కాలంలోనూ డీహైడ్రేషన్‌‌ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘డైలీ 6-9 గ్లాసుల నీళ్లు తాగాలి. వాటర్‌ తాగాలని అనిపించకపోతే సూప్‌లు, టీలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్లూయిడ్ అంది జీవక్రియ మెరుగవుతుంది’ అని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని స్వెటర్లతో కప్పి ఉంచకుండా సూర్యరశ్మి పడేలా చూసుకుంటే D-విటమిన్ అందుతుందని సూచిస్తున్నారు.

News December 9, 2025

IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్

image

IPL మినీ వేలంలో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి 1,355 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది. ఈ లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.

News December 9, 2025

హీరో రాజశేఖర్‌కు గాయాలు

image

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.