News March 3, 2025
రైల్వే స్టేషన్లలో డ్వాక్రా సంఘాల స్టాల్స్

TG: డ్వాక్రా సంఘాలతో 50 రైల్వేస్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 14 స్టేషన్లకు పర్మిషన్ వచ్చింది. సికింద్రాబాద్లో పిండి వంటలు, WGL స్టేషన్లో తృణధాన్యాలు, ఘన్పూర్లో చేతి ఉత్పత్తులు, శంకర్పల్లిలో జూట్, క్లాత్ బ్యాగులు, VKBలో గాజులు, పూసలు, హారాలు, భువనగిరిలో పిండివంటలు, చర్లపల్లిలో పోచంపల్లి చీరలు, సిర్పూర్లో సకినాలు, మురుకులు అందుబాటులో ఉంచనున్నారు.
Similar News
News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News October 22, 2025
బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.