News January 29, 2025

కుంభమేళాలో తొక్కిసలాట: యోగితో మాట్లాడిన అమిత్ షా

image

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు ఇబ్బంది పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రివేణి సంగమం వద్ద ఓ ఘాట్లో రాత్రి 2 గంటలకు అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 1, 2026

పాక్‌లో దాడులు.. 125 మంది మృతి

image

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.

News February 1, 2026

ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

image

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 1, 2026

మానసిక ఆరోగ్యం కోసం ఇవి తినాల్సిందే..

image

సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వేపుళ్లు, తీపి పదార్ధాలు, మాంసం ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల ఇన్‌ఫ్లమేష్ పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్, జింక్, ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, ఆమ్లా, అవకాడో, ఆలివ్ నూనె డైట్‌లో చేర్చుకోవాలి.