News January 29, 2025

మహాకుంభమేళాలో తొక్కిసలాట.. కీలక విషయాలు

image

మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి పలువురు మృతిచెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని కుంభమేళా DIG వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘాట్‌ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు సమాచారం.

Similar News

News December 9, 2025

జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 9, 2025

శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

image

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>

News December 9, 2025

క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

image

విండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.