News January 6, 2025

తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్ ఓనర్లకు రిలీఫ్

image

TG: తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ ఓనర్లకు భారీ ఊరట లభించింది. ఓనర్లు చిన్నరామిరెడ్డి, పెద్దరామిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు షూరిటీలు, రూ.25 వేలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

Similar News

News January 28, 2026

జనవరి 28: చరిత్రలో ఈరోజు

image

1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం (ఫొటోలో)
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1929: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం
1950: భారత సుప్రీంకోర్టు ప్రారంభం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: నటుడు, దర్శకుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం

News January 28, 2026

జలుబుతో గొంతు బొంగురుపోయిందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

image

జలుబు తర్వాత గొంతు బొంగురుపోవడం లేదా వాయిస్ పడిపోవడం లారింజైటిస్ వల్ల జరుగుతుంది. ఇన్ఫెక్షన్ కారణంగా వోకల్ కార్డ్స్ వాపునకు గురవడమే దీనికి కారణం. త్వరగా కోలుకోవాలంటే మాట్లాడకుండా గొంతుకు రెస్ట్ ఇవ్వాలి. తరచూ గోరువెచ్చని నీళ్లు తాగుతూ గొంతును తడి చేసుకోవాలి. ఉప్పు నీళ్లతో పుక్కిలించడం, తేనె తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్, కారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

News January 28, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.