News October 8, 2025
తొక్కిసలాట ఘటన.. సుప్రీంకు విజయ్ పార్టీ

తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటపై సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ సినీ హీరో విజయ్ పార్టీ <<17926042>>టీవీకే<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించింది. SC న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ అధికారి అస్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 8, 2025
20 ఏళ్ల కోసం నిర్మించి కూల్చేద్దామనుకున్నారు!

పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ను 20 ఏళ్ల కోసమే 1889లో నిర్మించారనే విషయం మీకు తెలుసా? ఫ్రెంచ్ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు దీనిని నిర్మించారు. అందమైన పారిస్‌లో ఈ టవర్ అసహ్యకరంగా కనిపిస్తుందని అక్కడి ప్రముఖుల నుంచి విమర్శలూ వచ్చాయి. కానీ రేడియో టెలిగ్రాఫీ ఆవిష్కరణకు టవర్ ఉపయోగపడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనికున్న యాంటెన్నాలు జర్మన్ సైన్యం కదలికలపై కీలక సమాచారం అందించాయి.
News October 8, 2025
రైట్స్‌లో 9 ఇంజినీరింగ్ పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) 9 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఈ, బీటెక్/ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి ఈనెల 17వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rites.com/
News October 8, 2025
BC రిజర్వేషన్లపై విచారణకు లంచ్ బ్రేక్

TG: BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణకు లంచ్ బ్రేక్ ప్రకటించిన జడ్జి 2:30pm నుంచి వాదనలు వింటామన్నారు. అంతకుముందు వాదనల్లో.. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి పాత చట్టం అమల్లో ఉన్నట్లే అని, దీంతో జీవో చెల్లదని పిటిషనర్ వాదించారు. అటు బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లాక గడువులోపు సంతకం పెట్టకుంటే కేబినెట్‌కు వస్తుందని, మళ్లీ పంపినా తర్వాత సానుకూల నిర్ణయం రాకుంటే జీవో ఇవ్వాలన్నారు.