News November 29, 2024

చిన్మయ్‌కు అండగా ఉంటాం: బంగ్లా ఇస్కాన్

image

చిన్మయ్‌ను బంగ్లా <<14733807>>ఇస్కాన్<<>> పట్టించుకోవట్లేదనే ఆరోపణల నేపథ్యంలో ఇస్కాన్ ప్రకటన విడుదల చేసింది. ఆయన స్వేచ్ఛ, హక్కులకు ఇస్కాన్ అండగా ఉంటుందని స్పష్టం చేసింది. దేశంలోని హిందువులు, వారు పూజించే స్థలాలను కాపాడటంలోనూ తోడుగా ఉంటుందని చెప్పింది. బంగ్లాలోని హిందూ సంఘాలు, హిందువులకు అండగా ఉంటుందని పేర్కొంది. మైనార్టీలు శాంతియుతంగా జీవించే పరిస్థితులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని వివరించింది.

Similar News

News November 15, 2025

ఇలాంటి ఫుడ్ రోజూ తింటే..

image

రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను తరుచూ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘రోజుకు మూడుసార్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారితో పోల్చితే 10సార్లు తినే మహిళల్లో అడెనోమా(క్యాన్సర్ కాని కణతులు) ముప్పు 45% ఎక్కువగా ఉంటుంది. ఇవే క్రమంగా క్యాన్సర్‌గా మారుతాయి’ అని USకు చెందిన JAMA ఆంకాలజీ పేర్కొంది. ఇందుకోసం 20 ఏళ్లలో 30వేల మందిపై సర్వే చేసినట్లు తెలిపింది.

News November 15, 2025

ప్రహరీ బయట మొక్కలను పెంచకూడదా?

image

పాదచారుల బాటపై 2, 3 వరుసల్లో మొక్కలు పెంచడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పచ్చదనం పెంచడం మంచిదే అయినా, ఇది పాదచారుల కోసం వదలాల్సిన స్థలాన్ని ఆక్రమిస్తుందంటున్నారు. ‘ఆ ప్రదేశం దాటి వాహనాలు నిలిపితే దారి మూసుకుపోతుంది. ఇంటి ప్రాంగణంలోనే మొక్కలు పెంచి, బయట పాదబాటలను నిర్విఘ్నంగా ఉంచడం ద్వారా వాస్తు శుభాలు, సామాజిక శ్రేయస్సు రెండూ కలుగుతాయి’ అని ఆయన సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 15, 2025

OFFICIAL: CSK కెప్టెన్‌‌గా గైక్వాడ్

image

IPL 2026 కోసం CSK కెప్టెన్‌ను ఆ జట్టు యాజమాన్యం కన్ఫామ్ చేసింది. తదుపరి సీజన్‌కు తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ ఉంటారని X వేదికగా వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది. CSK సంజూ శాంసన్‌ను తీసుకుని, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను RRకు ఇచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.