News May 4, 2024

‘బాధితులకు అండగా ఉండండి’.. కర్ణాటక సీఎంకు రాహుల్ లేఖ

image

ప్రజ్వల్ రేవణ్ణ కేసులోని బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని కోరుతూ కర్ణాటక CM సిద్ద రామయ్యకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘బాధ్యులపై చర్యలు తీసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మహిళలపై హింస జరుగుతుంటే మౌనం వహించే నేతను నేనెప్పుడూ చూడలేదు. ప్రధాని మోదీ నేరస్థులకు ఇస్తున్న మద్దతుతో హరియాణాలోని రెజ్లర్ల నుంచి మణిపుర్‌లోని అక్కచెల్లెళ్ల వరకు భారతీయ మహిళలందరూ బలవుతున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

News October 21, 2025

కోళ్లలో తెల్లపారుడు వ్యాధి – నివారణకు సూచనలు

image

కోడి పిల్లల్లో సాల్మొనెల్లా పుల్లొరం బ్యాక్టీరియా వల్ల తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.

News October 21, 2025

నిలవాలంటే గెలవాల్సిందే..

image

WWCలో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. తర్వాతి 2 మ్యాచుల్లో(న్యూజిలాండ్, బంగ్లాదేశ్)పై గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. అలా కాకుండా NZపై ఓడిపోతే BANపై తప్పకుండా గెలవాలి. అదే సమయంలో NZ తన తర్వాతి మ్యాచులో ENG చేతిలో ఓడాలి. అప్పుడే భారత్ SF చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం IND, NZ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. AUS, SA, ENG ఇప్పటికే సెమీస్ చేరాయి.