News June 28, 2024
స్టాన్లీ గ్రాండ్ ఎంట్రీ.. ఐపీఓలకు కొనసాగుతున్న ఆదరణ

స్టాన్లీ లైఫ్స్టైల్స్ ఈరోజు సెషన్లో 34% లాభంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయింది. ఐపీఓలో ఇష్యూ ప్రైస్ ₹369 ఉండగా లిస్టింగ్ ధర ₹494.95కు పెరిగింది. అలైడ్ బ్లెండర్స్, డివైన్ పవర్ IPOలకూ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. డివైన్ పవర్ ఐపీఓను (₹36-40/షేర్) 369 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలైడ్ బ్లెండర్స్ ఐపీఓలో (₹267-281/షేర్) 23.55రెట్లు ఎక్కువ కొనుగోళ్లు నమోదయ్యాయి.
Similar News
News December 6, 2025
వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 6, 2025
95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

95% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.
News December 6, 2025
కోట్ల మందికి తాగునీటి కొరత!

2050 నాటికి కోట్ల మందికి తాగునీరు అందని పరిస్థితి తలెత్తవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వియన్నాకు చెందిన కాంప్లెక్సిటీ సైన్స్ హబ్, ప్రపంచ బ్యాంక్ కలిసి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని 100కు పైగా నగరాలను పరిశీలించాయి. ఇష్టారీతిన విస్తరించుకుంటున్న నగరాల వలన 220M మందికి స్వచ్ఛమైన నీరు అందదని వెల్లడించింది. సరైన ప్రణాళిక ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని సూచించింది.


