News April 25, 2024
పీవీసీయూలో అన్ని ఇండస్ట్రీల స్టార్ నటులు: ప్రశాంత్ వర్మ

‘హనుమాన్’ మూవీ 100 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో కొత్తవారిని పరిచయం చేస్తామని చెప్పారు. దీని కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ నటులను ఎంపిక చేస్తామన్నారు. తన సినిమా నచ్చి పలువురు నటులు యూనివర్స్లో భాగమవ్వాలని అడిగినట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ ‘జై హనుమాన్’ మరో స్థాయిలో ఉంటుందన్నారు.
Similar News
News October 22, 2025
నేటి నుంచి కార్తీక వైభవం

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
రబీ సాగు- నేలను బట్టి ఈ పంటలతో లాభాలు

రబీలో నేల స్వభావం, నీటి తడులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ఎర్ర, నల్లరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వులు సాగు చేయవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవలు, జొన్నలు.. వర్షాధార నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేయవచ్చు.
News October 22, 2025
భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.