News October 20, 2024

స్టార్ డైరెక్టర్.. కానీ వాడే కారు మాత్రం..

image

మహానటి, కల్కి 2898ఏడీ సినిమాలతో నాగ్ అశ్విన్ అగ్రదర్శకుల సరసన చేరారు. ఆ స్థాయికి చేరాక రూ. కోట్ల విలువైన కార్లు వాడతారని అనుకుంటాం. కానీ ఆయన వాడుతున్న కారు చాలా చిన్నది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మహీంద్రా E2O ప్లస్ విద్యుత్ కారునే మహానటి, జాతిరత్నాలు, కల్కి 2898ఏడీ సినిమాలకు వాడుకున్నట్లు తెలిపారు. తమ ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్‌తో దాన్ని ఛార్జ్ చేస్తామని వివరించారు.

Similar News

News November 27, 2025

VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

image

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్‌లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.

News November 27, 2025

హీరోయిన్ కూడా మారారా!

image

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.

News November 27, 2025

స్వెటర్లు ధరిస్తున్నారా?

image

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.