News January 7, 2025
పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో, హీరోయిన్!

హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, జెండయా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్లో జెండయా డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఫ్యాన్స్ వారికి విషెస్ చెబుతున్నారు. ‘స్పైడర్‌మ్యాన్’ ఫ్రాంచైజీలో 3 సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 2021 నుంచి డేటింగ్లో ఉన్నారు. ఎంగేజ్మెంట్పై వారు ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్‌కాంగ్‌లోని అపార్ట్‌మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.


