News October 7, 2024
నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Similar News
News October 27, 2025
డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.
News October 27, 2025
ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
శ్రేయస్కు సీరియస్.. అసలు ఏమైందంటే?

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయింది. ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే Spleen(ప్లీహమ్) అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్(spleen rupture)కు దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకే శ్రేయస్ను ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.


