News March 20, 2024

సుహాస్ సరసన స్టార్ హీరోయిన్?

image

విభిన్న చిత్రాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా, అనిల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. ‘మహా నటి’ కీర్తి సురేశ్ ఈ మూవీలో సుహాస్ సరసన నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News January 4, 2026

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

image

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ‘శ్రీరామ్మూర్తి’

image

కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు అందే శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్మూర్తి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.