News January 2, 2025

లవ్ స్టోరీ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

image

ప్రియుడు ఆంథోనీని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్ తమ ప్రేమబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2010లో ఆంథోనీనే తనకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. ఓ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారని పెళ్లి అయ్యే వరకు దానిని తొలగించలేదన్నారు. తాను నటించిన సినిమాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చని తెలిపారు. కాగా గత నెలలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

Similar News

News November 24, 2025

ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

image

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.

News November 24, 2025

కాపర్ టి-రకాలు

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్‌ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్‌లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.

News November 24, 2025

4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.