News June 1, 2024
బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో కనిపించారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఆమె డిన్నర్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రణ్‌వీర్ తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ తాము కలిసే ఉన్నామంటూ రణ్‌వీర్ క్లారిటీ ఇచ్చారు.
Similar News
News January 20, 2025
లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం
AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్‌లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News January 20, 2025
మీ SBI అకౌంట్ నుంచి రూ.236 కట్ అయ్యాయా?
ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వాడే యూజర్ల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తోందన్న విషయం తెలుసా? డెబిట్ కార్డు రకాన్ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. క్లాసిక్/సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్ లెస్ కార్డులకు ₹236 (₹200+18%GST), గోల్డ్/కాంబో/మై కార్డ్(ఇమేజ్) కార్డులకు ₹250+GST, ప్లాటినం కార్డులకు ₹325+GST, ప్రైడ్/ప్రీమియం కార్డులకు ₹350+GST ఛార్జ్ చేస్తోంది.
News January 20, 2025
26 మంది IASలు బదిలీ
ఏపీలో 26 మంది IASలు బదిలీ అయ్యారు.
*CRDA కమిషనర్- కన్నబాబు
*సీఎం ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- సాయి ప్రసాద్
*పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- బి.రాజశేఖర్
*GVMC కమిషనర్- సంపత్ కుమార్