News March 29, 2024

దర్శకుడిగా స్టార్ హీరో కుమారుడు!

image

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హీరోగా కాకుండా ఆయన దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌తో సంజయ్ దర్శకత్వానికి ఒప్పందం కుదిరింది. కాగా ఈ సినిమాలో నటీనటులు ఇంకా ఖరారు కాలేదు. క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

Similar News

News January 26, 2026

కొత్త సినిమా ప్రకటించిన హీరో నితిన్

image

డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. ‘NO BODY NO RULES’ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. కాగా VI ఆనంద్ గతంలో ‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన’ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ అయినా నితిన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

News January 26, 2026

జనవరి 26: చరిత్రలో ఈరోజు

image

1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ
1957: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అవతరణ
1957: భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ జననం
1968: సినీనటుడు రవితేజ జననం
1986: హీరో నవదీప్ జననం
2001: గుజరాత్‌లో భూకంపం.. 20 వేల మందికిపైగా దుర్మరణం
2010: సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం
*భారత గణతంత్ర దినోత్సవం

News January 26, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి