News January 4, 2025
మణిపుర్ మిలిటెంట్లకు ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్!
మణిపుర్ మిలిటెంట్లు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహం నుంచి వచ్చే ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు అనుమతి లేకపోయినా వారు వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ ఉంది. కాగా గతేడాది మణిపుర్‌లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి అక్కడ కేంద్రం ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 6, 2025
గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న చర్లపల్లి-శ్రీకాకుళం, 9న శ్రీకాకుళం-చర్లపల్లి మధ్య రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం, 12, 16వ తేదీల్లో శ్రీకాకుళం-కాచిగూడ మధ్య ట్రైన్స్ నడపనున్నట్లు పేర్కొంది.
News January 6, 2025
EPFO పెన్షన్‌ను రూ.5వేలకు పెంచాలి: ట్రేడ్ యూనియన్లు
ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలతో వారు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. EPFO పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.5వేలకు పెంచాలని సూచించారు. ప్రైవేటీకరణను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
News January 6, 2025
రాత్రి 8లోపు డిన్నర్ చేస్తే ఇన్ని లాభాలా!
వివిధ కారణాలతో రాత్రిపూట ఆహారాన్ని తినడంలో చాలా మంది ఆలస్యం చేస్తుంటారు. అయితే, రాత్రి ఎనిమిది గంటలలోపు డిన్నర్ చేయడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘జీవక్రియ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నాణ్యమైన నిద్రపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండె వ్యాధులు, డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది’ అని తెలిపారు.