News January 20, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారైనట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, ‘నా ప్లేస్‌కు తిరిగి వచ్చాను’ అంటూ హర్షవర్ధన్ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం గమనార్హం.
Similar News
News January 24, 2026
776 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు!

TG: ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ఉన్న 776 మంది తాత్కాలిక(కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) సిబ్బందిని తొలగించాలని ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కాలేజీలు, ఆసుపత్రులలో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు DME ప్రకటించారు. రెగ్యులర్ నియామకాలు పూర్తికావడంతో వీరిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 24, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 24, 2026
క్లీనింగ్ టిప్స్

* ఫర్నిచర్‌పై గీతలు పడితే వాటిని షూ పాలిషర్తో క్లీన్ చేస్తే పోతాయి.
* ఫ్లాస్కులో దుర్వాసన రాకుండా ఉండాలంటే లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచండి.
* చెక్క వస్తువులను పాలిష్ చేయాలంటే వెనిగర్, వేడినీళ్ళు కలిపి క్లాత్‌తో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* బంగాళా దుంప తొక్కలతో గాజు వస్తువులను, అద్దాలను తుడిస్తే తళతళలాడతాయి.


