News July 24, 2024
భారత్‌తో టీ20లకు స్టార్ పేసర్ దూరం
భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక స్టార్ పేసర్ దుష్మంత చమీరా జట్టుకు దూరమయ్యారు. గాయం వల్లే అతడు సిరీస్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి జరగాల్సిన ఈ టీ20 సిరీస్‌కు లంక బోర్డు నిన్న జట్టును ప్రకటించింది. కాగా చమీరా స్థానంలో మరో పేసర్‌ను జట్టులోకి తీసుకోవాల్సి ఉంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మను చమీరా టీ20ల్లో 11 మ్యాచుల్లో 6సార్లు ఔట్ చేశారు.
Similar News
News January 27, 2025
దేశంలోనే తొలిసారి.. బిచ్చం అడిగినందుకు అరెస్ట్
దేశంలో ఎన్నడూ లేని విధంగా.. భిక్షాటన చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. భోపాల్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న యాచకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రం ఇటీవలే <<15081465>>భిక్షాటన నిరోధక చట్టాన్ని<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.
News January 27, 2025
పరిధి దాటేసిన ఏఐ.. మరింత ప్రమాదం?
AI ఉపయోగాలు కోకొల్లలు. కానీ దాని వల్ల వాటిల్లే ఉపద్రవాల గురించే ఆందోళన ఎక్కువగా ఉంది. దానిని నిజం చేసేలా AI మోడల్ తాజాగా తనను తానే క్లోనింగ్ చేసుకుంది. అలీబాబా, మెటా సంస్థలకు చెందిన రెండు లాంగ్వేజ్ మోడల్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘మోడల్ షట్‌డౌన్ కాకుండా ఉండేందుకు అపరిమిత క్లోనింగ్ చేసుకోగలుగుతోంది. అవసరమైతే వ్యవస్థను రీస్టార్ట్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’ అని పరిశోధకులు హెచ్చరించారు.
News January 27, 2025
ఇంటిపై నుంచి బాలికను తోసేసి చంపిన కోతి
ఇంటి డాబాపై చదువుతున్న పదో తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బిహార్‌లోని సివాన్‌లో జరిగింది. విద్యార్థిని ప్రియ డాబాపై చదువుకుంటుండగా కోతుల గుంపు దాడి చేసింది. భయంతో ఆమె బిల్డింగ్ అంచులకు వెళ్లగా ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ ప్రియను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది.