News February 6, 2025

స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.

Similar News

News February 6, 2025

2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

image

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.

News February 6, 2025

బీసీ, ఎస్సీ వర్గీకరణలపై 2 సభలకు సీఎల్పీ నిర్ణయం

image

TG: CLP భేటీలో CM రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. BC కులగణన, SC వర్గీకరణలపై 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. SC వర్గీకరణపై నల్గొండలో, BC వర్గీకరణపై ఉత్తర తెలంగాణలో సభలకు ప్లాన్ చేశారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. అటు వీటిపై గ్రామ, మండల, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

News February 6, 2025

స్టార్ సింగర్ విడాకులు.. భార్యకు $300Mల భరణం?

image

కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018లో వీరికి వివాహమవగా ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బీబర్ అన్‌మెచ్యూర్డ్ బిహేవియర్, డ్రగ్స్ వినియోగంపై ఇరువురికీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో తన బిడ్డ జాక్ బ్లూస్ భవిష్యత్తు కోసం ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. దీని ద్వారా హేలీకి $300 మిలియన్ల భరణం వస్తుందని సమాచారం.

error: Content is protected !!