News August 14, 2025

స్టార్ ప్లేయర్ తండ్రి కన్నుమూత

image

ప్రముఖ టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వెసీ పేస్(80) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఆస్పత్రిలోని చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. వెసీ పేస్ 1972లో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు.

Similar News

News August 16, 2025

రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

image

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

News August 16, 2025

విషమంగా యువరాణి ఆరోగ్యం.. మూడేళ్లుగా ఆస్పత్రిలోనే

image

థాయ్‌లాండ్ యువరాణి బజ్రకితియాభా(46) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2022 DECలో పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఆమె మూడేళ్లుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె లంగ్స్, కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని రాయల్ ప్యాలెస్ తాజాగా ప్రకటించింది. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్లూ ఉన్నట్లు చెప్పింది. ‘ప్రిన్సెస్ భా’గా పేరు పొందిన ఆమె థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ ముద్దుల కుమార్తె.

News August 16, 2025

కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేయాలంటే?

image

త్వరగా లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్నికృష్ణుడి విగ్రహం/చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. కన్నయ్యకు ఆహ్వానం పలుకుతూ వరిపిండితో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. వెన్న, అటుకులు, కలకండ, నెయ్యితో చేసిన లడ్డూలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.