News July 5, 2024
బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.
Similar News
News October 22, 2025
మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల హెచ్చరిక లేఖ విడుదలైంది. దీంతో ఆ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే చెడ్డపేరు వస్తుందని, ఇతర మావోయిస్టుల లొంగుబాట్లకు ఇబ్బంది వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
News October 22, 2025
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News October 22, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్ 26 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, STలకు రూ.944. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/