News April 24, 2024
హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి: పిటిషనర్‌పై CJI ఆగ్రహం

ఇంటర్ తర్వాత ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు(LLB) చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై CJI జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం సరిగానే ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది.
Similar News
News November 15, 2025
SSMB29: టైటిల్ ‘వారణాసి’

రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. అలాగే మహేశ్ క్యారెక్టర్‌ను రుద్రగా పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేశ్ నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. GlobeTrotter పేరుతో ప్రస్తుతం RFCలో ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది.
News November 15, 2025
ఓటింగ్‌కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీలో విజయం సాధించారు. అయితే ఓటింగ్‌కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.
News November 15, 2025
పార్టీ పరంగా 50% రిజర్వేషన్లకు ఖర్గే గ్రీన్ సిగ్నల్?

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, PCC చీఫ్ మహేశ్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు ఎల్లుండి జరిగే క్యాబినెట్లో రిజర్వేషన్లపై చర్చించనున్నారు.


