News June 18, 2024

దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించండి: టీటీడీ ఈవో

image

TTD ఈవో జే.శ్యామలారావు అధికారులకు కీలక సూచనలు చేశారు. కాలినడక భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. APSRTC, టూరిజం కోటా దర్శన టికెట్లు నిరుపయోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కచ్చితమైన దర్శన సమయాలు తెలిసేలా నారాయణగిరి షెడ్ల వద్ద ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

Similar News

News April 7, 2026

JEE టాపర్.. మనసుకు నచ్చిన పనిచేస్తూ!

image

JEE మెయిన్స్‌ టాపర్ కల్పిత్ వీర్వాల్(రాజస్థాన్) సింగర్‌గా మారారు. 2017లో 360/360 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆయన ముంబై IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అయితే కార్పొరేట్ జాబ్ రొటీన్ అవుతుందని.. తనకు ఇష్టమైన సంగీతంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన రైటర్, సింగర్‌గా రాణిస్తున్నారు. నచ్చని ఉద్యోగాల కంటే అభిరుచిని వృత్తిగా మార్చుకుంటే సంతోషంగా జీవించవచ్చని కల్పిత్ చెబుతున్నారు.

News April 7, 2026

అక్కడ తొలగించిన ఓటర్లలో 95% ముస్లింలే.. సంచలన నివేదిక

image

WBలోని నందిగ్రామ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తొలగించిన ఓటర్లలో 95.5% మంది ముస్లింలే ఉన్నట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. కేంద్రం కుట్రపూరితంగానే ఇలా చేస్తోందని CM మమత ఆరోపిస్తున్నారు. అటు బోగస్ ఓట్లను తొలగించడం రాజ్యాంగబద్ధమని BJP సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో BJP అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత స్వల్ప తేడాతో ఓడిపోయారు.

News April 7, 2026

పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

తనపై వస్తున్న పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట. ఒక కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట. నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను పెంచుతున్నానట. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి.. లేదంటే ఈ రోజుకి ఈ రూమర్స్ చాలు’ అంటూ ఇన్‌స్టా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.