News September 16, 2024
ఇవాళ ప్రారంభం.. 19 నుంచి అందుబాటులోకి

నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోదీ ఇవాళ వర్చువల్గా ప్రారంభించనున్నారు. 585 KM దూరాన్ని ఈ రైలు 7.15 గంటల్లో చేరుకుంటుంది. మంగళవారం మినహా రోజూ ఉ.5 గం.కు నాగ్పూర్లో బయల్దేరి మ.12.15 గం.కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మ.1కి SCలో బయల్దేరి రా.8.20కు నాగ్పూర్ చేరుతుంది. కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్లో రైలు ఆగుతుంది. 19 నుంచి రెగ్యులర్ సర్వీసు ప్రారంభమవుతుంది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


