News October 9, 2025
ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.
Similar News
News October 9, 2025
ఇది కాంగ్రెస్ డ్రామా: హరీశ్ రావు

TG: ఆరు గ్యారంటీల్లాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లూ కాంగ్రెస్ డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పనిచేసిందా? చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. కలిసి వచ్చేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన కుట్రలు విఫలం అయ్యాయి’ అని విమర్శించారు.
News October 9, 2025
రేపు రాష్ట్ర బంద్‌కు తీన్మార్ మల్లన్న పిలుపు

TG: BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఎటూ తేలని నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తాజా పరిణామాలపై రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు Way2Newsకు తెలిపారు. BC రిజర్వేషన్ల అంశంపై బాధ్యత వహిస్తూ CM రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా BCలు నిరసన తెలుపాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
News October 9, 2025
కొంపదీసి.. ట్రంప్‌కు శాంతి దక్కుతుందా? ఏంటి!!

ఏ దేశానికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికై చేయని ప్రయత్నం లేదు. INDIA-PAK వార్ ఆగడం సహా తాజా ఇజ్రాయెల్-హమాస్ చర్చల వరకు ఏదైనా ‘నేనే.. నేనే.. గొడవ ఆపింది’ అని క్రెడిట్ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పీస్ వస్తుందా? అనేది రేపు కమిటీ ప్రకటనతో తేలనుంది. నోబెల్‌కు తనను మించిన నోబుల్ పర్సన్ లేరు అనుకుంటున్న ట్రంప్‌కు శాంతి కాకపోయినా మనశ్శాంతైనా దక్కుతుందేమో చూడాలి.