News July 2, 2024
ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్?

TG: ఈ నెల 23న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
Similar News
News March 25, 2026
HYD: RTCలో భారీగా డిస్కౌంట్

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. HYDలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ప్రకటించింది. పెట్రోల్ బంకుల వద్ద క్యూలకు బదులుగా ప్రజా రవాణా వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఇది ఇంధన పొదుపు, కాలుష్య తగ్గింపు, ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. నగరంలో పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్పినా బంకుల వద్ద క్యూ లైన్లు తగ్గడం లేదు.
News March 25, 2026
మీలాంటి వారితో ఎప్పటికీ చర్చలు జరపం: IRGC

ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని US అధ్యక్షుడు ట్రంప్, US మీడియా చెబుతుంటే ఇరాన్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ట్రంప్ వంటి వ్యక్తులతో ఇరాన్ ఎన్నటికీ చర్చలు జరపదని IRGC స్పష్టం చేసింది. ఓటమిని ఒప్పందం పేరుతో కప్పిపుచ్చుకోవద్దని.. మీలో మీరే చర్చించుకునే స్థాయికి అంతర్గత కలహాలు చేరాయని ఎద్దేవా చేసింది. తమ సైన్యంతోనే ఇక్కడ స్థిరత్వం ఏర్పడుతుందని US గ్రహించే వరకు ఆయిల్ ధరలు తగ్గవంది.
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.


