News December 19, 2024
రాష్ట్ర అప్పు రూ.6.71 లక్షల కోట్లు: భట్టి

TG: రాష్ట్రానికి రూ.6.71 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ‘మేం ఏడాదిలోనే రూ.లక్ష కోట్లు అప్పు చేశామని హరీశ్ రావు ఆరోపించారు. కానీ మేం తెచ్చింది రూ.52,118 కోట్లు. BRS రూ.40,500 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది. మేము రూ.12వేల కోట్లు క్లియర్ చేశాం. ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో రూ.20,617 కోట్లు జమ చేశాం’ అని తెలిపారు.
Similar News
News January 22, 2026
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

యూరప్ దేశాలపై టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News January 22, 2026
అప్పుడు అలాస్కా.. ఇప్పుడు గ్రీన్లాండ్: ఇలా కొనుక్కోవచ్చా?

అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర ఒప్పందంతో ఇతర దేశాల భూభాగాలను కొనడం సాధ్యమే. 1867లో $7.2Mతో రష్యా నుంచి అలాస్కాను US కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుత విలువ సుమారు $700B పైమాటే. అయితే నేటి ఆధునిక చట్టాల ప్రకారం.. కేవలం డబ్బుతోనే కాకుండా ప్రభుత్వాల మధ్య అంగీకారం, స్థానిక ప్రజల ఆమోదం తప్పనిసరి. బలవంతపు ఆక్రమణకు UN రూల్స్ ఒప్పుకోవు.
News January 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి వాడే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.


