News March 22, 2025
అక్రమ వలసదారుల డేటా ఇచ్చిన విదేశాంగ శాఖ

ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 6వేల మందికి పైగా భారతీయులు వెనక్కి వచ్చారు. బైడెన్ కాలంలో ఈ సంఖ్య 3వేలుగా ఉంది. భారత్ నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారుల డేటాను విదేశాంగ శాఖ పార్లమెంటుకు అందజేసింది. 2009 నుంచి 2024 వరకు 15,564 మంది భారత్ కు తిరిగివచ్చారు. అయితే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 23, 2025
మే 7న ఏపీ ఐసెట్

AP: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ₹1000, 15 నుంచి 19 వరకు ₹2వేలు, 20 నుంచి 24 వరకు ₹4వేలు, 25 నుంచి 28వ తేదీ వరకు ₹10వేల లేట్ ఫీజుతో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/
News March 23, 2025
IPLలో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్-2025లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు హైదరాబాద్ వేదికగా SRH, RR తలపడనున్నాయి. రా.7.30 గంటలకు ఛాంపియన్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఈరోజు ఏయే జట్లు గెలుస్తాయని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News March 23, 2025
TG సిఫారసు లేఖలపై రేపటి నుంచి శ్రీవారి దర్శనం

TG ప్రజాప్రతినిధుల <<15790945>>సిఫారసు లేఖలపై<<>> తిరుమల శ్రీవారి దర్శనం రేపటి నుంచి అమలు కానుంది. సోమ, మంగళవారాల్లో VIP బ్రేక్, బుధ, గురువారాల్లో ₹300 స్పెషల్ దర్శనాలు ఉంటాయి. AP సిఫారసు లేఖలపై MONకి బదులు ఆదివారం దర్శనాలకు అనుమతిస్తారు. కాగా ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. 24, 29 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.