News April 5, 2025
కొత్త ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి: CBN

AP: ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. NTR జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి రోజుల్లో సెల్ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని, అనేక సేవలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
e-KYC పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు రద్దు!

AP: e-KYC పూర్తి చేయించుకోని వారి రేషన్ కార్డులను రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ e-KYC చేయించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో చాలా మంది ఇంకా e-KYC చేయించుకోలేదని, డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే e-KYC పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.
News November 7, 2025
ఊచకోత.. 6 ఓవర్లలో 148 రన్స్

Hong Kong Sixes 2025 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 6 ఓవర్ల మ్యాచులో ఏకంగా 148/2 చేసింది. కెప్టెన్ గుల్బదిన్ 12 బంతుల్లో 50, జనత్ 11 బంతుల్లో 46 రన్స్ చేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్స్ 400కు పైగానే ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 ఓవర్లలో 99 రన్స్ చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 25 సిక్సర్లు బాదారు.
News November 7, 2025
వేదాలను ఎందుకు చదవాలి?

ప్రతి జీవి కోరుకునేది ఆనందం. దాన్ని పొందడానికి మనిషి 2 విషయాలు చేస్తాడు. మొదటిది కోరుకున్న వాటిని పొందడం. అంటే మంచి చదువు, ఉద్యోగం, ఐశ్వర్యం. రెండోది ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం. అంటే అనారోగ్యం, అప్పులు అన్నమాట. ఈ రెండు కోరికలు నెరవేరడానికి ఏం చేయాలో వేదాలు బోధిస్తాయి. వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడమే కాక, కోరికలను నెరవేర్చుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి పరిష్కారం చూపుతాయి. <<-se>>#VedikVibes<<>>


