News April 7, 2025
రాష్ట్రానికి రూ.34,600 కోట్ల మద్యం ఆదాయం

TG: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7% విక్రయాలు పెరిగినట్లు స్పష్టం చేసింది. పన్నుల రూపంలో రూ.7,000 కోట్లు, దరఖాస్తుల ద్వారా 264 కోట్లు వచ్చాయంది. బీర్ల కంపెనీలు 15 రోజులు సరఫరా నిలిపివేయడంతో వీటి అమ్మకాలు 3% తగ్గినట్లు పేర్కొంది.
Similar News
News October 16, 2025
LSG స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ‘కేన్ మామ’?

SRH తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన కేన్ విలియమ్సన్ కొత్త అవతారం ఎత్తనున్నారు. పంత్ సారథ్యం వహిస్తున్న LSGకి స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఎంపికయ్యే ఛాన్సుంది. LSG జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నట్లు తెలియగా, ఆ స్థానాన్ని కేన్ రూపంలో భర్తీ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. రానున్న మినీ ఆక్షన్‌లో కేన్ మామ సేవలను ఉపయోగించుకోవాలని LSG భావిస్తోంది.
News October 16, 2025
లాభాల్లో మొదలైన మార్కెట్లు

వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బెల్, టైటాన్, మహీంద్రా&మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎటర్నల్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉండగా ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News October 16, 2025
వారంలోగా వాస్తవాలు తెలపండి: కృష్ణా బోర్డు

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు DPR తయారీకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారంలో వాస్తవాలు తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. DPR, ప్రాజెక్టు పనులన్నీంటినీ ఆపాలని TG ENC అంజాద్ ఇటీవల CWCకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా CWCని ఆదేశించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బోర్డు స్పందించి తాజా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.