News July 31, 2024

రెవెన్యూ మిగులుతో రాష్ట్రం అప్పగించాం: కేటీఆర్

image

TG: 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో బీఆర్ఎస్‌కు రాష్ట్రాన్ని అప్పగించిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కాంగ్రెస్‌కు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పగించినట్లు అసెంబ్లీలో తెలిపారు. బడ్జెట్‌లో మిగులు ఉందని చెబుతూనే జీతాలకు అప్పులు తెస్తున్నామని ఆర్థికమంత్రి చెబుతున్నారని అన్నారు. మంత్రుల మాటలు తప్పో.. బడ్జెట్‌లోని లెక్కలు తప్పో.. స్పష్టం చేయాలని ఆయన కోరారు.

Similar News

News March 7, 2025

ప్చ్.. భార్యా బాధిత భర్తలు బతికేదెలా!

image

భరించే వాడే భర్త అనే నానుడికి కాలం చెల్లింది. ఇప్పుడు భరించలేక బాధపడుతున్నాడు భర్త. బరువు మోయలేక, బంధాలు తెంచుకోలేక, బతుకునే త్యాగం చేసేస్తున్నాడు భర్త. కొన్నాళ్లుగా భార్యా బాధితుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తన బాధను పంచుకుంటే వెక్కిరించే సమాజాన్ని నమ్మలేక, అండగా నిలిచే ధైర్యం దొరక్క, న్యాయ పోరాటం చేయలేక, చట్టాలను ఎదిరించలేక, మౌనంగా రోదిస్తూ ఉరితాడును మెడకేసుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారేదెలా?

News March 7, 2025

‘ది ప్యారడైజ్’ కథ ఇదేనట!

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా కథ గురించి సినీ వర్గాలు ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాయి. ఇది 1980ల నాటి కల్పిత సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే చిత్రమని తెలిపాయి. ఇందులో నాని అణగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తారని పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి పాత్రను నాని చేయలేదని వెల్లడించాయి. ఆటవికంగా ఉన్నా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందన్నాయి.

News March 7, 2025

ఈశాన్య భారతంలో కీలక పరిణామం.. ఏంటంటే!

image

ఈశాన్య భారతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్ జుంటా సర్కారుపై పోరాడుతున్న చిన్ స్టేట్ ప్రో డెమోక్రసీ రెబల్ గ్రూప్స్ మిజోరం CM లాల్దుహోమా సమక్షంలో ఐజ్వాల్‌లో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిసింది. చిన్‌ల్యాండ్ కౌన్సిల్, ICNCC కలిసి సంయుక్త చిన్ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నాయి. ఈశాన్యంలో శాంతి స్థాపనకిది కీలకం కానుంది. చిన్‌లో ఉండేది మిజో ప్రజలే. ఇక్కడి వాళ్లతో వారికి సంబంధాలు ఉన్నాయి.

error: Content is protected !!