News March 24, 2025
కాంగ్రెస్ అధిష్ఠానంతో రాష్ట్ర నేతల భేటీ

కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.
Similar News
News March 29, 2025
భారతీయుల వద్ద ఎంత బంగారమో!

భారతీయుల వద్ద ఉన్న బంగారం కొన్ని దేశాల రిజర్వు బ్యాంకుల గోల్డ్ నిల్వల కంటే ఎక్కువని HSBC గ్లోబల్ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం భారతీయుల వద్ద 25వేల టన్నులకు పైగా బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.150 లక్షల కోట్లు. భారత్, US, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల రిజర్వు బ్యాంకుల్లోని బంగారం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. మున్ముందు ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది.
News March 29, 2025
694 మంది మృతి

నిన్న సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 694 మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో 68 మంది మిస్సింగ్ అయినట్లు తెలిపాయి. ఈ విషాద ఘటనలో 1670 మంది గాయపడ్డారని వెల్లడించాయి. అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 1000 ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపంతో భవనాలు కుప్పకూలగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి.
News March 29, 2025
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

TG: ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36-41 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.