News August 26, 2024
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: KTR

TG: డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటివరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘నిన్న ఐదుగురు, ఇవాళ ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు. ఒక్క బెడ్‌ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చింది’ అని డిమాండ్ చేశారు.
Similar News
News September 17, 2025
మహారాష్ట్ర క్లబ్‌లో తెలంగాణ జూదరులు

మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ జూదానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పేకాట నిర్వహణపై ఉక్కుపాదం మోపడంతో వీరంతా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాకు ఆనుకోని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఇండోర్ క్లబ్‌ల పేరిట అనుమతులు తీసుకుంటూ నిర్వాహకులు పేకాట నిర్వహిస్తూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు. అక్కడ ఆడే వాళ్లంతా MNCL, ASF జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం.
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.
News September 17, 2025
కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.