News May 13, 2024

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం@9AM

image

లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌లో ఇప్పటివరకు 10.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఉ.9గంటల వరకు ఏపీలో 9.05%, బిహార్ 10.18%, జమ్మూ కశ్మీర్ 5.07%, ఝార్ఖండ్ 11.78%, మధ్యప్రదేశ్ 14.97%, ఒడిశా 9.23%, మహారాష్ట్ర 6.45%, తెలంగాణ 9.51%, యూపీ 11.67%, వెస్ట్ బెంగాల్‌లో 15.24% ఓటింగ్ రికార్డు అయినట్లు ఈసీ వెల్లడించింది.

Similar News

News March 19, 2026

ఎల్లుండి రంజాన్.. రేపు సెలవు లేదు

image

AP: రేపు (మార్చి 20) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ పని దినం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. <<19427809>>రంజాన్<<>> మార్చి 21న జరుపుకోవాలని మతపెద్దలు సూచించడంతో సెలవును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (మార్చి 21) పబ్లిక్ హాలిడే ఉంటుందని పేర్కొంది. అయితే శనివారం జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ నిర్వహణపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News March 19, 2026

యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

image

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.

News March 19, 2026

పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

image

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్‌లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.