News September 21, 2024

JKకు రాష్ట్ర హోదా మా ప్రాధాన్యం: కాంగ్రెస్‌

image

జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా క‌ల్పించ‌డ‌మే త‌మ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని కాంగ్రెస్ తెలిపింది. జ‌మ్మూలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖ‌ర్గే మాట్లాడుతూ JKకు కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీల్లో రాష్ట్ర హోదా మొద‌టి ప్రాధాన్య‌మ‌న్నారు. అలాగే ప్ర‌తి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేద‌ని, ఉద్యోగాల పేరుతో యువ‌త‌ను వంచించింద‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు.

Similar News

News January 5, 2026

వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.

News January 5, 2026

AIIMS రాయ్‌పుర్‌లో 115పోస్టులు… అప్లై చేశారా?

image

<>AIIMS <<>>రాయ్‌పుర్‌లో 115 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBBS, MD/MS/DNB/డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC,ST,PwBDలకు ఫీజు లేదు. నెలకు రూ. 67,000+అలవెన్సులు చెల్లిస్తారు. https://www.aiimsraipur.edu.in

News January 5, 2026

శివుడిని మనసారా పూజిస్తే ఎన్ని లాభాలో..

image

బాహ్య పూజలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలుంటాయి. కానీ మానస పూజలో మనసు పూర్తిగా దైవంపైనే లీనమవుతుంది. మనసులోని అశాంతిని పోగొట్టి, ఏకాగ్రతను పెంచుకోవడానికి శివ మానస పూజ ఉత్తమ మార్గం. అహంకారాన్ని తొలగించి ‘నేనే దైవం’ అనే జ్ఞానాన్ని పొందేందుకు ఈ పూజ చేస్తారు. ప్రయాణాల్లో ఉన్నవారు కూడా శివుడిని సదా స్మరించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. కోటి బాహ్య పూజల కంటే ఒక మానస పూజ శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు.