News August 15, 2024

రాయల్టీపై రాష్ట్రాలకే అధికారం: సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

2005 ఏప్రిల్ 1 నుంచి గనులు, ఖనిజ భూములపై కేంద్రం వసూలు చేసిన రాయల్టీ, పన్నులను తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. 12ఏళ్ల వ్యవధిలో దశలవారీగా చెల్లించాలని పేర్కొంది. గనుల భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో 35 ఏళ్లుగా కేంద్ర-రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సమస్యకు ముగింపు పలికినట్లయింది.

Similar News

News January 20, 2025

రాహుల్ గాంధీకి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

image

పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో HM అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని RG ఆరోపించారు. దీంతో ఆయనపై BJP నేత నవీన్ ఝా దావా వేశారు. తన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవంటూ 2024 FEBలో రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.

News January 20, 2025

ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత

image

ప్రముఖ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.

News January 20, 2025

Paytm Q3 Results: తగ్గిన నష్టం, పడిపోయిన ఆదాయం

image

Q3లో ఫిన్‌టెక్ మేజర్ Paytm నికర నష్టం రూ.219 కోట్ల నుంచి రూ.208 కోట్లకు తగ్గింది. ఆదాయంలో మాత్రం 36% మేర కోతపడింది. గత ఏడాది ఇదే సమయంలోని రూ.2,851 కోట్ల నుంచి రూ.1,828 కోట్లకు పడిపోయింది. GMV, చందాదారుల పెరుగుదలతో QoQ పద్ధతిన రెవెన్యూ 10% ఎగిసింది. నగదు రూ.2,851 కోట్లు పెరిగి రూ.12,850 కోట్లుగా ఉంది. PAYPAYలో వాటా విక్రయమే ఇందుకు కారణం. నేడు ఈ షేర్లు 1.35% ఎగిసి రూ.912 వద్ద ట్రేడవుతున్నాయి.