News November 26, 2024

DEC 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

image

TG: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని డ్రైవర్స్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు RTA జాయింట్ కమిషనర్‌కు సమ్మె పత్రాన్ని యూనియన్ సభ్యులు అందజేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, కొత్త పర్మిట్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా రూ.10 లక్షలకు పెంపు, డ్రైవర్లకు ఏటా రూ.12 వేలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 26, 2024

IPL: 10 జట్లు ఇవే..

image

IPL-2025 మెగా వేలం నిన్న రాత్రి అట్టహాసంగా ముగిసింది. మొత్తం 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. దాదాపు అన్ని జట్లలో చాలామంది కొత్త ఆటగాళ్లు వచ్చి చేరారు. పైనున్న ఇమేజ్‌లలో జట్ల రిటెన్షన్, కొనుగోలు చేసిన ప్లేయర్ల వివరాలు చూడొచ్చు. కాగా వచ్చే ఏడాది మార్చి 14న మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మరి మీ ఫేవరెట్ జట్టేదో కామెంట్ చేయండి.

News November 26, 2024

యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: టీజీపీఎస్సీ

image

TG: వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. DEC 16న జరిగే RRB పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.

News November 26, 2024

జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు

image

AP: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.