News November 13, 2024

మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస

image

TG: దమ్ముంటే మూసీ ఒడ్డున బస చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో టీబీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న 25 మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బస చేయనున్నారు. ఆరోజు సా.4 గంటల నుంచి మరుసటి రోజు ఉ.8 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా పరీవాహక ప్రాంతాల ప్రజలను తరలిస్తుండటంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.

Similar News

News January 24, 2026

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

News January 24, 2026

అరుణోదయ స్నానం చేయడానికి జిల్లేడు ఆకులు దొరకకపోతే…

image

రథసప్తమి పర్వదినాన ఆచరించే అరుణోదయ స్నానానికి జిల్లేడు ఆకులు తప్పనిసరి. అవి దొరకకపోతే వాటికి బదులుగా చిక్కుడు/రేగు ఆకులు వాడొచ్చని పండితులు చెబుతున్నారు. చిక్కుడు ఆకులు, కాయలతో రథాన్ని రూపొందించి, తమలపాకుపై రక్తచందనంతో సూర్య బింబాన్ని తీర్చిదిద్ది ఆవాహన చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. ఈరోజున స్త్రీలు నోములు నోచుకోవడం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

News January 24, 2026

బ్యాంకు ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలం

image

సమ్మె విరమించుకోవాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంకు యూనియన్స్(UFBU)తో చీఫ్ లేబర్ కమిషనర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులతో గురు, శుక్రవారం చర్చలు జరిపినా వారి నుంచి సానుకూల స్పందన రాలేదని UFBU ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముందు చెప్పిన విధంగా JAN 27న సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు(నాల్గవ శనివారం, ఆది, రిపబ్లిక్ డే, సమ్మె) పనిచేయవు.