News September 1, 2024

ఆ మందుల నిషేధంపై స్టే

image

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్స్‌ మందులపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మ్యాన్‌కైండ్‌ ఫార్మా, లీఫోర్డ్‌ హెల్త్‌కేర్‌, నవిల్‌ ల్యాబరేటరీస్‌, ఇండోకో రెమిడీస్‌ సహా 6 ఔషధ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారించిన కోర్టు నిషేధంపై స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Similar News

News January 15, 2025

హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

News January 15, 2025

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు?

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

News January 15, 2025

‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.