News April 4, 2025
ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో యాజమాన్యంతో చర్చిస్తామని, సానుకూలంగా స్పందించకపోతే 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. రేపు సాయంత్రం ఫ్యాక్టరీ ఆర్చ్ వద్ద రాస్తారోకో చేస్తామని తెలిపాయి. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నాయి.
Similar News
News April 12, 2025
9,970 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్‌తోపాటు ITI, ఇంజినీరింగ్‌లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
News April 12, 2025
మీకు ఏ యాప్ పని చేయట్లేదు?

యూపీఐ పేమెంట్స్‌లో మరోసారి అంతరాయం ఏర్పడింది. కొందరు UPI యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయగా తమ అకౌంట్లో అమౌంట్ డెబిట్ అయ్యిందని, కానీ అవతలి వాళ్లకు క్రెడిట్ కాలేదని అంటున్నారు. మరి మీరు ఏ UPI యాప్ వాడి ఇలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు. కామెంట్ చేయండి.
* PhonePe
* Google Pay
* Paytm
* BHIM UPI
* Others
News April 12, 2025
IPL: టాస్ గెలిచిన LSG

IPLలో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కుమార్తె అనారోగ్యం కారణంగా మిచెల్ మార్ష్ ఈ మ్యాచుకు అందుబాటులో లేరు. LSG: మార్క్రమ్, పూరన్, పంత్(C), హిమ్మత్ సింగ్, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్. GT: సుదర్శన్, గిల్(C), బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, టివాటియా, అర్షద్, రషీద్, సాయికిశోర్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్.