News December 17, 2024
హైకోర్టుకు చేరిన స్టెల్లా నౌక వ్యవహారం

AP: స్టెల్లా నౌకలో తమ బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ, ఎక్స్పోర్ట్, పద్మశ్రీ, సూర్యశ్రీ రైస్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. లోడ్ చేసేందుకు తమకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సర్కార్ను ఆదేశించింది.
Similar News
News December 4, 2025
కాగజ్నగర్లో మళ్లీ పులి భయం

కాగజ్నగర్ డివిజన్లో మళ్లీ పులి భయం మొదలైంది. నవంబర్ నెలలోనే నలుగురు పులి దాడిలో మరణించారు. పులులు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ ఆవాసం, తోడు కోసం సంచరిస్తుంటాయి. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 10 కిలోమీటర్లకు పైగా తిరుగుతాయి. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెంచికల్పేట్ మండలంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.


