News March 30, 2025
సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 1, 2025
రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రెస్ మీట్లో వెల్లడించారు. రేపు క్వశ్చన్ అవర్ పూర్తైన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు. 8 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని, అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు. బిల్లు గురించి వివరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు. మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.
News April 1, 2025
కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News April 1, 2025
ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

IPL: CSK బ్యాటర్ ధోనీపై మాజీ క్రికెటర్ ఉతప్ప తీవ్ర విమర్శలు చేశారు. RCB, RRతో జరిగిన మ్యాచ్ల్లో ధోనీ 9, 7 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్కు వచ్చారో అర్థం కావట్లేదన్నారు. మొత్తానికే రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని ఘాటుగా స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధోనీ తీరుపై ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.