News February 24, 2025
IT నుంచి AI దిశగా అడుగులు: గవర్నర్

AP: 2047నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. ‘పెన్షన్లు రూ.4వేలకు పెంచాం. ఏడాదికి రూ.3సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. పోలవరంను పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. IT నుంచి AI రివల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం’ అని తెలిపారు.
Similar News
News October 17, 2025
నవంబర్ 11న సెలవు

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News October 17, 2025
తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <
News October 17, 2025
లడ్డూ ప్రసాదాలపై ఆ ప్రచారం అవాస్తవం: TTD

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరలు పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.