News December 26, 2024

బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. టాలీవుడ్‌కు బ్రాండ్ తీసుకొచ్చి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

Similar News

News December 27, 2024

తినడానికి తిండిలేక మన్మోహన్ పస్తులు

image

ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.

News December 27, 2024

భారత్‌పై స్మిత్ రికార్డు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.

News December 27, 2024

మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ

image

మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్‌ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.